మోడల్ టౌన్లుగా మారనున్న తాడేపల్లి , మంగళగిరి!

Thursday, August 6th, 2020, 12:08:39 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది లో భాగం గా తాడేపల్లి ను, మంగళ గిరి ప్రాంతాలను మోడల్ టౌన్ లు గా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం తో దూసుకుపోతున్న జగన్ మరొక ముందడుగు వేశారు. అయితే ఈ మోడల్ టౌన్ ల కోసం 1,173 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. భారీ బడ్జెట్ తో వీటిని అభివృద్ది చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు ను ఏపీ యూ ఐ ఎం ఎల్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.

అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా, రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.