సీఎం జగన్ మరొక కీలక నిర్ణయం…గ్రామ సచివాలయాలకు శాశ్వత భవనాలు

Thursday, November 26th, 2020, 06:56:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామం లోని సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రం లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీటి కోసం సీఎం జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల కి పక్కా శాశ్వత భవనాలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వచ్చే ఏడాదీ మార్చి నాటికి ఈ గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.

అయితే మొత్తం 10,929 భవనాలకి 3,825 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ఒక్కో క్క భవన నిర్మాణం కోసం 35 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే గ్రామానికి పెద్ద దిక్కు గ్రామ సచివాలయం అని, అవే శాశ్వతంగా నిర్మిస్తే గ్రామ స్వరాజ్యం మొదలు, జై జగన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.