ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..!

Wednesday, March 17th, 2021, 03:00:34 AM IST


ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యాక తన కేబినెట్‌లో ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి అందరిని షాక్‌కి గురిచేశాడు. అయితే తాజాగా కార్పోరేషన్లు, మున్సిపాలిటీల విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మొన్న కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎంపిక జరగబోతుంది.

అయితే ఈ సారి ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ మేరకు ఆర్డినెన్స్ రూపొందించి దానిని త్వరలోనే గవర్నర్ ఆమోదానికి కూడా పంపుతున్నట్టు తెలుస్తుంది. అయితే తొలుత ఒక్కొక్కరితోనే ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ ఆమోదం రాగానే మళ్లీ మరో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్లకు ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నారు.