సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా..!

Tuesday, April 7th, 2020, 12:40:06 AM IST

ఏపీలో కరోనా విజృభిస్తున్న నేపధ్యంలో సీఎం జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 300కి పైగా కరోనా కేసులు నమోదవ్వడంతో ఇకపై కరోనా కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై కరోనా బారిన పడిన వారిని ప్రైవేట్‌ ఆస్పత్రులలో కూడా చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కొత్తగా 15 రకాల వైద్య చికిత్స విధానాలను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి కరోనా వైద్య చికిత్సకు ధరల ప్యాకేజీ నిర్ణయిస్తూ 16 వేల నుంచి 2.16లక్షల వరకు కరోనా చికిత్స ఫీజులను నిర్ణయించింది.