బిగ్ డిసీషన్: టీడీపీ నోరు మూయించబోతున్న సీఎం జగన్..!

Thursday, January 7th, 2021, 03:00:45 AM IST


ఏపీలో దేవాలయలపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాకే దేవాలయాలపై దాడులు పెరిగాయని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపణలు చేస్తుంటే, మా సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే ఇలా దేవాలయాలపై టీడీపీ దాడులు చేయించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని వైసీపీ కౌంటర్ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష టీడీపీ నోరు మూయించేలా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే 2016 కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో టీడీపీ ప్రభుత్వం కూల్చిన ఆలయాలను పునర్నర్మిచేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. విజయవాడలోని దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డు బొమ్మ, గోశాల కృష్ణుడి దేవాలయాల నిర్మాణానికి సీఎం జగన్ ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే రూ.70 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 40 ఆలయాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.