ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Friday, October 30th, 2020, 12:05:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు మిలాడ్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, సామరస్యత, సోదరభావం పెపొందించుకోవాలన్న ప్రవక్త బోధనలు మానవాళినీ ధర్మ మార్గం లో నడిపించేందుకు స్ఫూర్తి కలిగిస్తాయి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పలువురు నేతలు, రాజకీయ నాయకులు సైతం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.