కర్నూల్ ప్రమాద ఘటన పై సీఎం జగన్ దిగ్భ్రాంతి…డ్రైవర్ నిద్ర మత్తు వల్లే..!

Sunday, February 14th, 2021, 12:30:57 PM IST

కర్నూల్ జిల్లా లో జరిగిన ప్రమాద ఘటన పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి కి వ్యక్తం చేశారు. ఈ ఘటన లో 14 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుండి బయట పడ్డారు. అయితే ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయ సహకారాలు అందించాలి అని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి అని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షించారు. ఈ ఘటన పై మంత్రులు, ఎమ్మెల్యే లు, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

అయితే టెంపో మిని బస్ డ్రైవర్ నిద్ర మత్తు లోకి జారుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగింది అని,జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ అన్నారు. ప్రాథమిక విచారణ లో ఈ విషయం వెల్లడి అయింది అని వ్యాఖ్యానించారు. మొత్తం ఈ ఘటన పై ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞాన బృందం విచారణ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.