ఏలూరు ఘటన పై వైద్య అధికారులతో సీఎం జగన్ సమీక్ష

Monday, December 7th, 2020, 03:00:08 PM IST

ఏలూరు ఘటన పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఎటువంటి చికిత్స అందిస్తున్నారు, ఎలా అందిస్తున్నారు అనే దాని పై అధికారుల ను సీఎం జగన్ అడిగారు. అస్వస్తకు గల కారణాలను, అందుకు కోసం చేసిన పరీక్షల వివరాలను అడిగారు జగన్. అయితే బాధితులు అందరి రిపోర్టులు కూడా సాధారణం గా ఉన్నాయి అని అధికారులు వివరించారు. అయితే బాధితుల్లో అన్ని వయసుల కి చెందిన వారు ఉన్నారు అని, ఏలూరు అర్బన్ ప్రాంతం లో మాత్రమే కాకుండా రూరల్, మరియు దెందులూరు లో కేసులు గుర్తించాం అని తెలిపారు.

అయితే ఇప్పటికే ఎయిమ్స్ నుండి డాక్టర్ల బృందం వచ్చింది అని అధికారులు సీఎం జగన్ కి తెలిపారు. అంతేకాక ఐ ఐ సి టి మరియు ఎన్ ఐ ఎన్, ఐ సి ఎం ఆర్ బృందాలు కూడా వస్తున్న విషయాన్ని వెల్లడించారు. అయితే ఒకసారి డిశ్చార్జ్ అయిన వారు మళ్లీ ఆసుపత్రికి వస్తున్నారా లేదా అనే విషయం పై సీఎం జగన్ అధికారులను ఆరా తీశారు. అంతేకాక వారికి ఆహారం, మందులు అందించాలి అని, డిశ్చార్జ్ అయిన వారిని అబ్జర్వేషన్ లో ఉంచాలి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి వారికి సూచించారు. వైద్య సిబ్బంది, అధికారులు అంతా కూడా అందుబాటులో ఉండాలి అని, ప్రజలు ఎవరికి ఏ ఇబ్బందీ వచ్చినా 104,108 కి కాల్ చేసేలా అవగాహన కల్పించాలి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు.