ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న జగన్ సర్కార్..!

Tuesday, February 16th, 2021, 03:00:20 AM IST


ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరికొత్త కార్యక్రమాలను చేపడుతున్న సీఎం జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌ – క్లాప్ పేరిట ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. దీనిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ దీనిపై 100 రోజల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంతేకాదు ఈ కార్యక్రమంలో ఎన్జీవోలు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. అయితే ఈ కార్యక్రమం అమలు కోసం కొత్తగా 3,825 చెత్తను సేకరించే వాహనాలతో పాటు, మరిన్ని కొత్త ఆటో టిప్పర్లు, 6 వేలకు పైగా బిన్స్‌ ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాల్టీలలో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలు, బయోమైనింగ్‌ను కూడా ప్రారంభించాలని, క్లాప్‌తో పరిశుభ్రత విషయంలో మార్పు కనిపించాలని సీఎం జగన్ అధికారులతో అన్నారు.