రుయా ఘటన పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Tuesday, May 11th, 2021, 03:55:02 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి లోని రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన పట్ల ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆక్సిజన్ మరియు పడకల కొరత పై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశం లో సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మన చేతుల్లో లేని అంశాలకు బాధ్యత వహించాల్సి వస్తోంది అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమిళనాడు రాష్ట్రం నుండి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేదు అని చెప్పుకొచ్చారు. అయితే ఆసుపత్రిలో 11 మంది చనిపోయారు అని అధికారులు చెప్పారు అని అన్నారు. నిన్న కూడా 6 ట్యాంకర్ లని ఒడిశా కి పంపిన విషయాన్ని వెల్లడించారు. అయితే రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్ లిఫ్ట్ చేశాం అని వ్యాఖ్యానించారు. అయితే విదేశాల్లో ఆక్సీజన్ కొనుగోలు చేసి నౌకల ద్వారా తెప్పిస్తున్నాం అని అన్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు. కరోనా తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అని వ్యాఖ్యానించారు. బాధాకర ఘటనలు జరుగుతున్నాయి అని, కలెక్టర్లు అంతా అప్రమత్తతో వ్యవహరించాలి అని, మానవత్వం చూపాలి అని తెలిపారు. అయితే రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటూ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.