వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసిన సీఎం జగన్

Tuesday, May 18th, 2021, 03:15:57 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఆన్లైన్ విధానం ద్వారా మత్స్య కారులకు వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేశారు. అయితే రాష్ట్రం లోని మత్స్యకారులకు అండగా ఉంటామన్నా మాటను నిలబెట్టుకున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే కరోనా సంక్షోభం లోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే అధికారం లోకి వచ్చిన 2019 లోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామనీ చెప్పుకొచ్చారు. అయితే కోవిడ్ సమయం లో ప్రభుత్వానికి ఆర్ధిక కష్టాలు ఉన్నాయి అని, అయినప్పటికీ పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని అన్నారు. అయితే వరుసగా మూడో ఏడాది ఈ నిధులు ఇస్తున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నామని అన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1,19,875 మంది మత్స్యకార కుటుంబాలను ఈ పథకం ద్వారా ఆదుకుంటున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే ఏ సంక్షేమ పథకం లో నైనా అవినీతి, వివక్ష కు తావు లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు.