అనూష హత్యపై స్పందించిన సీఎం జగన్‌.. రూ.10 లక్షల ఆర్థిక సహాయం..!

Thursday, February 25th, 2021, 12:23:46 AM IST


గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్య ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న అన్నారు. అనూషను హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని, నేరాన్ని నిరూపించి నిందితుడికి కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అయితే అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించి, వారిలో భరోసా కల్పించాలని సీఎం జగన్ సూచించారు.

అయితే గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోట అనూష నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీకి చెందిన తోటి విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కొంతకాలంగా అతడి ప్రవర్తన నచ్చక అనూష అతడిని దూరం పెట్టింది. దీంతో అనూషపై విష్ణువర్ధన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అనూషను బైక్ పై తీసుకెళ్లిన విష్ణువర్ధన్ రెడ్డి పాలపాడు రోడ్డులోని సాగర్ మేజర్ కాలువ వద్దకు తీసుకు వెళ్ళి గొంతునులిమి చంపేశాడు.