కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు – సీఎం జగన్

Wednesday, October 21st, 2020, 10:12:17 AM IST

ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్దుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం అని ఈ సభలో జగన్ పేర్కొన్నారు.

నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాలి అని, సంఘ విద్రోహులు, తీవ్ర వాదాన్ని ఉపేక్షించవద్దు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు అని, కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర హోంమంత్రి గా ఒక మహిళను నియమించామని, దిశా చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు.

అయితే దిశ బిల్లును కేంద్రానికి పంపాం అని, మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు.అయితే పోలీసుల భర్తీ కి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరి లో పోస్టుల భర్తీ కి షెడ్యూల్ విడుదల చేస్తాం అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాక పోలీస్ శాఖకి చెల్లించాల్సిన బకాయిలను సైతం చెల్లిస్తామని జగన్ ఈ సభలో పేర్కొన్నారు.