నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటాడు – సీఎం జగన్

Wednesday, September 2nd, 2020, 12:08:32 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్దంతి సందర్భంగా ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. నిన్న కుటుంబ సభ్యులతో ఇడుపులపాయకు వెళ్లిన సీఎం జగన్ రాత్రి అక్కడే బస చేశారు. నేడు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం వైఎస్ సమాధి దగ్గర నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవల్ని, అమలు చేసిన పథకాల్నీ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన జగన్ నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అని ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దని నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారని అన్నారు.