పాటశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభించండి – సీఎం జగన్

Friday, February 5th, 2021, 05:53:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖాధికారులకి పలు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో పాటశాల లు కూడా పూర్తి స్థాయిలో తేరుచుకొలేదు. అయితే పాటశాల లను ఉదయం 9 గంటలకు ప్రారంభించండి అంటూ సీఎం జగన్ నేడు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుంది అని, వారి మెదడు కూడా విషయాలను త్వరగా గ్రహించగలుగుతుంది అని, కాబట్టి ఉదయం 9 గంటలకే స్కూళ్లు ప్రారంభించండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే మరోపక్క మనబడి నాడు నేడు కార్యక్రమం విషయం లో సీఎం జగన్ దృష్టి సారించారు.

పనుల విషయం లో ఎక్కడా కూడా రాజీ పడొద్దు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మొదటి విడత లో ఎదురు అయిన అనుభవాలు దృష్టిలో ఉంచుకొని సమర్థవంతంగా పను లు చేపట్టండి అంటూ ఆదేశాలను జారీ చేశారు. ఏప్రిల్ 15 నుండి రెండవ విడత పనులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 31 లోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించండి అంటూ అధికారులకు ఆదేశాలు చేశారు సీఎం జగన్.