మూడో ఏడాది “వైఎస్సార్ రైతు భరోసా” తొలి విడత విడుదల చేసిన సీఎం జగన్

Thursday, May 13th, 2021, 01:55:14 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో ఏడాది వరుసగా వైఎస్సార్ రైతు భరోసా తొలి విడత ను విడుదల చేసారు. ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు సీఎం జగన్. అయితే ఈ నేపథ్యం లో సీఎం జగన్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నాం అని అన్నారు. మొత్తం 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్ల సాయం అందిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే అర్హులు అయిన రైతు కుటుంబాలకు ఏటా 13,000 రూపాయలను మూడు విడతలు గా అందజేస్తున్నాం అని అన్నారు. అయితే ఖరీఫ్ కి ముందు మొదటి విడత కింద 7,500 కోట్ల రూపాయల సాయం అందిస్తున్నాం అని అన్నారు. అయితే కరోనా వైరస్ లాంటి కష్ట కాలంలో కూడా రైతులకు సహాయం అందజేస్తున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు బీసీ రైతులకు కూడా రైతు భరోసా కింద సాయం అందిస్తున్నాం అని అన్నారు.

దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ కూడా 13,101 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లోకి నేరుగా జమ చేశామని అన్నారు. అయితే కరోనా వైరస్ వాక్సిన్ పై సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. దేశం లో 18 ఏళ్లు పైబడిన వారికి 172 కోట్ల డోసులు కావాలని, కానీ ఇప్పటి వరకు 18 కోట్ల డోసులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని అన్నారు. అయితే ఏపీ లో 18 ఏళ్లు పై బడిన వారికి 7 కోట్ల టీకా డోసులు కావాలని, కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 73 లక్షల టీకా డోసులను మాత్రమే ఇచ్చింది అని చెప్పుకొచ్చారు.