రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ది సాధ్యం – సీఎం జగన్

Saturday, August 15th, 2020, 01:02:30 PM IST

విజయవాడ లోని ఇందిరా గాంధీ స్టేడియం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండా ను ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటే నే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి పౌరుడు కూడా దేశ భక్తి ను పెంపొందించు కోవాలని తెలిపారు. సమానత్వం అనే పదం పుస్తకాలకే పరిమితం చేయకూడదు అని, ఎస్సీ, బీసీ, మైనారిటీ లు మరింత అభివృద్ధి చెందాలని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన ముఖ్యమైన పనులను సీఎం జగన్ ప్రసంగం లో వివరించారు. 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు అందిస్తున్నాం అని అన్నారు. రైతు భరోసా, ఆంగ్ల మాధ్యమం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక వికేంద్రీకరణ పై జగన్ మరొకసారి ప్రస్తావించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారికి న్యాయం జరగాలి అని, అందుకే మూడు రాజధానుల బిల్లు ను చట్టం గా మార్చాం అని అన్నారు.