అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్.. ఏం చర్చించారంటే?

Wednesday, December 16th, 2020, 01:00:48 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన వీరి భేటీలో వరద సాయం, వ్యవసాయ చట్టాలు, పోలవరం నిధులపై మరియు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ భేటీలో సీఎం జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

కాగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్‌ బంద్‌కు వైసీపీ సర్కారు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. సాగు చట్టాలపై జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇందుకోసం 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ తీర్మానించింది. అయితే ఏపీలో కూడా ఈ సదస్సులు విజయవంతం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ సదస్సులను విజయవంతం చేసేందుకు సహకరించాలని అమిత్ షా జగన్‌ను కోరినట్టు తెలుస్తుంది.