కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ.. ఏం చర్చించారంటే?

Wednesday, January 20th, 2021, 02:08:02 AM IST


ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో భేటీ అయ్యారు. ఢిల్లో పర్యటనలో భాగంగా అమిత్ షా‌తో భేటీ అయిన సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను కూడా జగన్ అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం.

అయితే అమిత్ షాతో భేటీ తర్వాత పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. పోలవరం పెండింగ్ నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అమిత్‌షా బేటీలో సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.