కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ సమావేశం…చర్చించిన అంశాలు ఇవే!

Wednesday, December 16th, 2020, 12:01:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేడు పర్యటన లో భాగం గా సీఎం జగన్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు లో సవరించిన అంచనాలు ఆమోదించాలని మంత్రి ను కోరారు. అంతేకాక ప్రాజెక్ట్ సవరించిన వ్యయం 55,656 కోట్ల రూపాయలు ఆమోదించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

అయితే భూ సేకరణ మరియు పునరావాస పనులకు అయ్యే మొత్తం ఖర్చును రీయింబర్స్ చేయాలని కోరారు. రావాల్సిన నిధులు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కేంద్ర మంత్రి తో సీఎం జగన్ దాదాపు అరగంట పాటు సమావేశం అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ నిన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన సంగతి తెలిసిందే. వరద బాధితులకి సహాయం, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరారు.