గవర్నర్ తో సీఎం జగన్ భేటీ…వీటి పై చర్చ జరిగే అవకాశం?

Friday, November 13th, 2020, 12:46:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కలిశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు కలిసి గవర్నర్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఉదయం రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలవడం జరిగింది.అయితే పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాకుండా పలు కీలక విషయాల పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా రాజకీయ పరిస్థితుల పైన మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పై గవర్నర్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వివరించనున్నారు. అంతేకాక పలు కీలక విషయాల పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది.