వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్..!

Friday, September 11th, 2020, 02:00:34 PM IST

ఏపీ సీఎం జగన్ నేడు మరో పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే మహిళలకు ఆర్థిక చేయతూ ఇచ్చేలా వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. నేడు తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 87.75 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.

అయితే మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ. 27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతలలో జమచేయనుంది. అయితే తొలివిడతలో భాగంగా రూ.6,792.20 కోట్లను నేడు డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేశారు. అయితే బ్యాంకర్లు ఆ డబ్బును పాత అప్పులకు మినహాయించుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అర్హత ఉన్నప్పటికీ జాబితాల్లో పేర్లు లేని సంఘాలు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.