వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్..!

Wednesday, August 12th, 2020, 01:50:23 PM IST

ysr-cheyutha-scheme

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న సీఎం జగన్ తాజాగా వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్.

అనంతరం మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం ప్రకారం ఏడాదికి 18,750 ల చొప్పున నాలుగేళ్లలో 75 వేల ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు అందించనున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈ పథకం ద్వారా 23 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని, ఈ పథకానికి ప్రభుత్వం 4,700 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.