వైయస్సార్ భీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Wednesday, March 31st, 2021, 03:38:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ భీమా కింద వర్చువల్ విధానం లో లబ్ది దారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేశారు. 2020 అక్టోబర్ 21 న పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా అనుకొని విపత్తుగా ఇంటి పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు వైఎస్సార్ భీమా పధకం. అయితే ఇందుకోసం సీఎం జగన్ రూ.254 కొట్లు చెల్లిస్తున్నారు. అయితే అర్హత ఉండి బ్యాంకుల్లో నమోదు కానీ ఆ 12,039 కుటుంబాలను ఆదుకుంటున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అయితే మొత్తం 1.41 కోట్ల కుటుంబాల కోసం ఏటా రూ.510 కోట్ల ఖర్చు చేస్తోంది ప్రభుత్వము. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.