ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకే ఉంది – సీఎం జగన్

Thursday, October 8th, 2020, 02:12:59 PM IST

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్ ప్రారంభించారు. విజయవాడలోని పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42.34 లక్షల మంది విద్యార్ధులకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్‌లో 3 జతల యూనిఫాం, జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, పుస్తకాలు, నోట్స్ బుక్స్, బ్యాగ్, మాస్క్ ఉంటాయి.

అయితే యూనిఫామ్స్ కుట్టు కూలి కూడా పిల్లల తల్లుల అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేయనున్నది. విద్యాకానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం 650 కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్ ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉందని, అందులో భాగమైన ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మనసుకు అనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్ధి గొప్పగా చదువుకోవాలని, ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లలో రావాలని అందుకే విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టామని అన్నారు.