సీఎం జగన్ చేతుల మీదుగా ఆప్కాస్ ప్రారంభం!

Friday, July 3rd, 2020, 03:35:37 PM IST

ప్రతి పక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వద్దకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి జీతాలు సరిగ్గా చెల్లించడం లేదు అని ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి అయిన ఏడాదికే ఎన్నో పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక హామీని నెరవేర్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సిడ్ సర్వీసెస్ ను సీఎం జగన్ తాడేపల్లి లోని కాంప్ కార్యాలయం లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఇక పై ఉద్యోగాల భర్తీ లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా, ఎలాంటి అవక తవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ ఆప్కొస్ ను తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం లో జీతాలు ఇవ్వడానికి, ఉద్యోగాలు రావడానికి లంచాలు తీసుకున్నారు అని, అది పాదయాత్ర సమయం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తనకు చెప్పారు అని వ్యాఖ్యానించారు.అయితే ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.అంతేకాక ఇక పై వీటి సంఖ్యను పెంచేందుకు సైతం కృషి చేస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం పై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక బడుగు బలహీన వర్గాలకు, మహిళల రిజర్వేషన లను పాటిస్తూనే ఈ నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది.