ఏపీ అమూల్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్

Wednesday, December 2nd, 2020, 09:00:27 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. రాష్ట్రం లో పాడిపరిశ్రమ పై ఆధారపడిన రైతుల కి లీటర్ కి అదనంగా అయిదు రూపాయలు అయినా ఆదాయం పెరగాలి అని అన్నారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం మరొక ముందడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ అమూల్ అంటూ సీఎం జగన్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ అమూల్ వెబ్సైట్ మరియు డాష్ బోర్డ్ ను సీఎం జగన్ అవిష్కరించారు. అయితే అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని 9,899 గ్రామాల్లో పాల సేకరణ పెంపునకు దోహదపడుతుంది అని అన్నారు. అయితే మూడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఈ సంస్థ రైతుల నుండి అధిక ధరలకు పాలు కొనడం సహ, ప్రతి ఏడాది ఈ పాల మార్కెటింగ్ పై వచ్చే లాభాన్ని బోనస్ గా చెల్లిస్తుంది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ స్థాయి కంపనీ లతో అమూల్ సంస్థ పోటీ పడుతుంది అని తెలిపారు.

అయితే అమూల్ రాకతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాల సహకార విప్లవం ప్రారంభం అవుతుంది అని తెలిపారు. అంతేకాక ప్రైవేట్ పాల సేకరణ సంస్థలు కూడా ఎక్కువ ధరలు చెల్లించాల్సిన పరిస్తితి వస్తుంది అని అన్నారు. అయితే తొలి దశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ పాల సేకరణ చేయనున్నట్లు వివరించారు. అయితే దశల వారీగా 6,551 కోట్ల రూపాయల తోఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.