ఆరోగ్య శ్రీ పథకం పై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు!

Saturday, September 5th, 2020, 03:00:28 AM IST

YS_Jagan
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరోగ్య శ్రీ పథకం విషయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రద్ద పెడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ పథకం అత్యంత పతిష్టంగా అమలు చేయాలి అని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ఆ పథకాన్ని నీరు గర్చెలా ఆసుపత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అయితే ప్రతి ఆరోగ్య శ్రీ ఆసుపత్రి లో హెల్ప్ డెస్క్ లు తప్పని సరి అని అన్నారు. ఆరోగ్య మిత్ర లతో పాటుగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు పై ఆదేశాలను జారీ చేశారు.అంతేకాక రిఫరల్ విధానం కూడా చాలా సమర్థవంతంగా ఉండాలి అని అన్నారు. అయితే రోగులకు సరైన చికిత్స అందడం లేదు అంటే వారిని సరైన ఆసుపత్రికి పంపే బాధ్యత ఆరోగ్య మిత్ర లదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక కాల్ సెంటర్ లకి ప్రతి రోజూ మాక్ కాల్ చేసి పనితీరును పరిశీలించాలి అని తెలిపారు. అంతేకాక ఆ రెస్పాండ్ ను రికార్డ్ చేయాలి అని అన్నారు. రోగుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి అని,ఆరోగ్య శ్రీ పరిధి లోని ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వాలి అంటూ అధికారులకు సూచించారు సీఎం జగన్.