సొంత నాయకులపై సీరియస్ అవుతున్న సీఎం జగన్ – కారణం పవన్ కళ్యాణా…?

Thursday, February 13th, 2020, 09:15:23 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కర్నూలులో ర్యాలీ, సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ ర్యాలీలో ముఖ్యంగా… కొందరు మృగాలా చేతిలో 2017 లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైనటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక 10వ తరగతి గిరిజన విద్యార్థిని సుగాలి ప్రీతి విషయంలో ఇప్పటికి కూడా న్యాయం జరగలేదని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఒక బాలిక పై అంతటి దారుణం జరిగితే ప్రభుత్వాలు కనీసం స్పందించకపోవడం దారుణమని పవన్ మండిపడ్డారు.

అయితే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చేసిన వాఖ్యలపై ఆగ్రహించిన వైసీపీ నేతలు కొందరు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాన్నీ బయటకు తీస్తూ పలు దూషణలు చేశారు. అయితే ఈ విషయం సీఎం జగన్ కి తెలియడంతో పవన్ పై సీరియస్ అయిన వైసీపీ నేతలపై మండిపడ్డారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎక్కడా ప్రస్తావన తీయొద్దని పలు మార్లు చెప్పినప్పటికీ కూడా ఇలా బహిరంగంగా వైసీపీ నేతలు మాట్లాడటంతో వారందరికీ కూడా సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.