ఏపీ అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు పరువును సీఎం జగన్ తీసేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం సర్దర్శన కోసం మహిళలను బస్సుల్లో తీసుకుపోయి చంద్రబాబు ఏం చేశాడో చూడండని ఓ వీడియోను ప్రదర్శించారు. పోలవరం సందర్శనకు వెళ్లిన వారు చంద్రబాబుపై పాడిన భజన పాట వీడియోను సీఎం జగన్ అసెంబ్లీలో ప్రదర్శించి నవ్వులు పూయించారు. చంద్రబాబు కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని వారంతా భజన చేశారు.
అయితే పోలవరం సందర్శన పేరుతో గత చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ముఖ్యంగా ‘చంద్రన్న భజన’ కోసం ఏకంగా రూ.83 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారని సీఎం జగన్ ఆధారాలను చూపించారు. ఆయన గారి భజన కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి అంటూ ఆ వీడొయోను చూసి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మిగిలిన సభ్యులు కూడా పడి పడి నవ్వుకున్నారు. చివరకు ఆ పాట చూస్తూ నవ్వి అలిసిపోయిన సీఎం జగన్ మధ్యలోనే ఆ వీడియోను ఆపివేయించారు.