తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్..!

Friday, November 20th, 2020, 06:36:32 PM IST

12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కారాలంటే ప్రజలకు ఓ మహా పండుగ అనే చెప్పాలి. అయితే పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను నేడు సీఎం జగన్ ప్రారంభించారు. సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. 12 రోజులపాటు జరిగే తుంగభద్ర పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు.

అయితే ప్రస్తుతం కరోనా నేపధ్యంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. నేటి నుంచి డిసెంబర్ 1వ తేది వరకు ప్యుష్కరాలు జరగనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.