ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఆ జీతాలు ఇచ్చేందుకు ఒకే..!

Friday, October 23rd, 2020, 10:23:20 PM IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్ అందించారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల పాటు తగ్గించిన డిఫర్ జీతాలు ఇచ్చేందుకు సీఎం జగన్ ఒకే చెప్పినట్టు ఏపీ ఎన్జీవో సంఘం వెల్లడించింది. అంతేకాదు సీపీఎస్‌ అమలు, పీఆర్‌సీ విషయంలో కూడా సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

అయితే కరోనా సోకిన ఉద్యోగులకు నెల రోజుల పాటు సెలవు ఇవ్వాలని కోరామని దీనిపై కూడా సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రెండు నెలల డిఫర్ జీతాలు, పెన్షన్లు, డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ఇక నాల్గో తరగతి ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్ళకు పెంచేందుకు కూడా అంగీకరించారని అన్నారు. ఇదేకాకుండా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరామని, ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలాలను ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.