వైఎస్ కుటుంబ విధేయుడికి కీలక పదవి కట్టబెట్టిన సీఎం జగన్..!

Friday, August 28th, 2020, 07:26:11 AM IST

jagan

వైఎస్ కుటుంబ విధేయుడికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవికి ఆయనకు జీతం, అలవెన్సులు కలిపి నెలకు 1.76 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాదు ఆయనకు 9 మంది సిబ్బందిని కూడా కేటాయించారు.

ఇదిలా ఉంటే వ్యవసాయ కుటుంబానికి చెందిన అంబటి కృష్ణారెడ్డి వేరుశెనగ, వంటనూనెల వ్యాపారంలో బాగా ఎదిగారు. ఆయన చదివింది పదో తరగతిలోపే. సాగులో కొత్త ప్రయోగాలుకానీ, ఆదర్శ రైతుగా పురస్కారాలు కానీ ఏవీ అందుకోలేదు. అయితే కేవలం కృష్ణా రెడ్డి వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారని, ఇటీవల ఆయనకు కడప జడ్పీ చైర్మన్‌ పదవి ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారని అయితే ఆ పదవిని మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి కేటాయించడంతో కృష్ణారెడ్డిని కేబినెట్‌ హోదాతో వ్యవసాయ సలహాదారుగా నియమించినట్లు సమాచారం.