సీఎస్ నీలం సాహ్ని ను సత్కరించిన సీఎం జగన్

Friday, December 18th, 2020, 03:32:59 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. అయితే ఈ నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నీలం సా హ్ని ను ఘనంగా సత్కరించడం జరిగింది. కేబినెట్ సమావేశం లో మంత్రి మండలి లో ఉన్న సభ్యులు ఆమెను సత్కరించారు. నవంబర్ 14, 2019 న బాధ్యతలు చేపట్టిన ఆమె ఈ ఏడాది పదవి విరమణ చేయనున్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గా చేసిన తొలి మహిళ గా నియమితులు అయిన సంగతి తెలిసిందే.

జగన్ నేతృత్వం లో జరిగిన ఈ సత్కరణ కి సంబంధించిన వీడియో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సి ఎం ఓ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.