రూ.330 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన

Wednesday, November 4th, 2020, 08:44:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయం తో ఇప్పటికే అన్ని ప్రాంతాల పై ఫోకస్ చేస్తున్న జగన్, ఏలూరు లో నేడు పర్యటించనున్నారు. నేడు ఉదయం 10:35 గంటల సమయం లో ఏలూరు ప్రాంతం లోని అల్లూరి సీతారామరాజు స్టేడియం కి హెలికాప్టర్ లో చేరుకోనున్నారు. అయితే వివి నగర్ బెయి లీ బ్రిడ్జి సెంటర్ వద్ద రూ. 330 కోట్ల తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం జగన్ శంకుస్థాపన చేసిన అనంతరం శ్రీ సూర్య కన్వేన్షన్ హలు లో ఎస్ ఎం ఆర్ పెదబాబు నూర్జహాన్ ల వివాహానికి హజరు కానున్నారు, ఈ వేడుక కి హజరు అయిన అనంతరం సీఎం జగన్ తాడేపల్లి లోని తన నివాసానికి బయలుదేరుతారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మరొక 330 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తుండటం తో సీఎం జగన్ పాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు.