బిగ్ న్యూస్: ఏపీలో నేటి నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ..!

Friday, December 25th, 2020, 08:04:07 AM IST

ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలన్న లక్ష్యంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలోచించి రాష్ట్రంలోని నిరు పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పుడో జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తుంది. అయితే క్రిస్మస్ పండగ రోజు ఖచ్చితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం చెప్పినట్టే చేస్తుంది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 15 రోజుల పాటు 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కానున్నాయి. సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా కొమరిగిరిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇంటి స్థలాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల భూమిని సేకరించి, 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలను అభివృద్ధి చేశారు.