నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

Tuesday, December 15th, 2020, 07:36:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ కి వెళ్లనున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సమావేశం లో సీఎం జగన్ పలు కీలక విషయాల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశాలతో పాటుగా రాష్ట్ర పునర్విభజన చట్టం లో పరిష్కారం కానీ కొన్ని సమస్యలను, అంతేకాక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను సీఎం జగన్ అమిత్ షా తో చర్చించనున్నారు అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పోలవరం విషయం లో ఇప్పటికే అధికార వైసీపీ కి, ప్రతి పక్ష టీడీపీ కి మద్య మాటల యుద్దాలు నడుస్తున్నాయి. సీఎం జగన్ చర్చించే విషయాలు నేడు కీలకం కానున్నాయి.