ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు..!

Thursday, June 10th, 2021, 03:02:08 AM IST

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. నేడు ఉదయం 10:30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీ బయలుదేరి మధ్యాహ్నం 1:40 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని రాత్రి 9 గంటలకు హోంమంత్రి అమిత్‌షాను కలవబోతున్నారు. అనంతరం జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నట్టు తెలుస్తుంది. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.