వైసీపీ ఎమ్మెల్సీ అభర్థిని ప్రకటించిన సీఎం జగన్..!

Wednesday, August 12th, 2020, 10:00:56 AM IST

ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు పేరును సీఎం జగన్ ఖరారు చేశారు. మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఖాలీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది.

ఈ నేపధ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ దివంగత సీనియర్‌ నాయకులు పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేశ్ బాబును వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ విధంగానైనా పెన్మత్స సాంబశివరాజు కుటుంబానికి న్యాయం చేసినట్టుందని ఉంటుందని జగన్ భావించారట.