సీబీఎన్ అంటే కరోనా కి భయపడే నాయుడు

Wednesday, December 2nd, 2020, 12:00:45 AM IST

ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నివర్ తుఫాన్ తో నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించలేదు అని తెలిపారు. అసెంబ్లీ సమావేశం లో మాట్లాడిన జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కి భయపడి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చున్నారు అని విమర్శించారు. అయితే అసెంబ్లీ లో మాత్రం ఎల్లో మీడియా కవరేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నారు అంటూ మండిపడ్డారు.

అయితే సీబీఎన్ అంటే కరోనా కి భయపడే నాయుడు అంటూ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సభ లో చంద్రబాబు నాయుడు ఎందుకు రెచ్చిపోయారు అనేది అర్దం కావడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే తను ప్రతి పక్ష నేతగా అయిదేళ్ళు ఉన్నా, ఏనాడూ కూడా పోడియం వద్దకు పోలేదు అని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీరి ప్రవర్తన తో పలువురు చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు నాయుడు తీరు పై వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తుండగా, వైసీపీ తీరు పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.