ఏపీలో స్కూళ్ల ప్రారంభంపై సీఎం జగన్ పుల్ క్లారిటీ..!

Tuesday, October 20th, 2020, 06:24:53 PM IST

ఏపీలో నవంబర్ 2వ తేది నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనిపై సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 2వ తేది నుంచే స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయని, అయితే 1,3,5,7 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు ఒక రోజు మరియు 2,4,6,8 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు మరో రోజు తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు.

అయితే విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులు తరగతులు నిర్వహిస్తామని అయితే మధ్యాహ్నం వరకు ఒంటి పూట స్కూళ్లు పనిచేస్తాయని అననరు. పరిస్థితులను బట్టి దీనిపై డిసెంబర్‌లో మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపకపోతే వారికి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.