ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్..!

Wednesday, August 19th, 2020, 04:02:24 PM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వారు తీసుకున్న రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సెప్టెంబర్ 11న ప్రారంభించాలని కేబినెట్ తీర్మానం చేసింది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 5న వైఎస్ఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించాలని తీర్మానం చేశారు. ఇదే కాకుండా డిసెంబర్ నుంచి ఇంటింటికీ రేషన్ అమలు చేయాలని కూడా నిర్ణయించారు. వీటితో పాటు ఈ నెల 25న జలవివాదాలపై జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై కూడా కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం.