బిగ్ న్యూస్: వారికి చప్పట్లతో అభినందనలు తెలిపిన సీఎం జగన్

Friday, October 2nd, 2020, 11:42:53 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు పలు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. అయితే అందులో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయాలు నేటికీ ఏడాది పూర్తి చేసుకున్నాయి. అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరియు వాలంటీర్ లకు చప్పట్లతో అభినందనలు తెలపాలని సీఎం జగన్ సూచించిన సంగతి తెలిసిందే.

సాయంత్రము ఏడు గంటల సమయం లో తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయం లో సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్ లకు చప్పట్లతో అభినందనలు తెలిపారు. సీఎం జగన్ తో పాటుగా మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ మరియు ఉన్నత అధికారులు ఉన్నారు.