ఏపీ సీఎం జగన్‌కు మరో కీలక బాధ్యతలు..!

Saturday, August 29th, 2020, 03:35:38 PM IST

ఏపీ సీఎం జగన్ మరో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ డెవ‌లప్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అథారిటీనీ ఏర్పాటు చేసింది. అయితే ఈ అథారిటీని ఏర్పాటుకు సంబంధించి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుబంధంగా ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీని కూడా నియమిస్తూ నోటిఫికేషన్ వెలువ‌రించారు.

అయితే ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీకి సీఎం జగన్ ఛైర్మన్‌గా నియమితుడు కాగా, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మన్‌గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిని నియమించగా, వివిధ శాఖలకు చెందిన 11 మంది ముఖ్యకార్యదర్శులను, ఉన్నతాధికారులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.