బిగ్ న్యూస్: జగన్ సర్కార్ “జగనన్న తోడు” కార్యక్రమానికి నేడే శ్రీకారం

Wednesday, November 25th, 2020, 03:00:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు పథకాలను, కార్యక్రమాలను ప్రవేశ పెడుతూ పేదలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రం లో పలు విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉండేందుకు మరొక కార్యక్రమం చేపట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

వందకు రోజుకు ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు వడ్డీతో పేదల రక్తాన్ని పీల్చే జలగలకు అడ్డుకట్ట అంటూ వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేయడం జరిగింది. నిరుపేద, చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి ఆర్థిక అవసరాలు తీర్చడానికి జగన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక జగనన్న తోడు అంటూ పేర్కొన్నారు. అయితే చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం అంటూ పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన కార్యక్రమాల పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జనం కోసం జన్మ ఎత్తిన నాయకుడు సీఎం జగన్ అంటూ కొనియాడుతున్నారు. కార్యక్రమాన్ని నేడే ప్రారంభించనున్నారు. దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పది వేల చొప్పున సుమారు వెయ్యి కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం కి శ్రీకారం చుట్టనున్నారు.