మరొక శుభవార్త చెప్పిన సీఎం జగన్ – వారికి కూడా రూ.5 వేల పరిహారం…?

Friday, May 22nd, 2020, 11:14:12 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేయాలనీ పలు ఆంక్షలు విధిస్తూ, పలు కీలకమైన నిర్ణయాలను తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ తరుణంలో పరిస్థితి చాలా దారుణంగా పడిపోయింది. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో అమలులోఉన్నటువంటి లాక్ డౌన్ నుండి పలు సడలింపులు మరియు, మినహాయింపులు ప్రకటిస్తున్నారు. అయితే ఈ మేరకు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే అన్ని రకాల దుకాణాలు, అన్ని కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి.

కానీ రాష్ట్రంలో అన్ని మతపరమైన దేవాలయాలు, మసీద్ లు, చర్చ్ లు మాత్రం ఇంకా తెరుచుకోవడం లేదు. కాగా ఈ నెల మొత్తం వాటిని తెరవడానికి ఎలాంటి అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆలయాల్లో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ కూర్మంలో వారందరిని కూడా ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా దేవాలయాల్లో పనిచేస్తున్న 31,017 మంది అర్చకులకు రూ.5వేల రూపాయలు అందించాలని నిర్ణయించింది. అర్చకులతో పాటు, 7వేల మంది ఇమాంలు, మౌజంలు, 29,841 మంది పాస్టర్ల ఖాతాల్లోకి కూడా రూ.5వేలు జమ చేయడానికి నిర్ణయించుకుంది. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.33.93 కోట్ల రూపాయలను విడుదల చేసింది.