రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళనున్న సీఎం జగన్.. కారణం అదే..!

Thursday, February 13th, 2020, 05:14:07 PM IST


ఏపీ సీఎం జగన్ రేపు మళ్ళీ ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరనున్న జగన్ సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో భేటీ కానున్నారు. అయితే నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీనీ కలిసిన సీఎం జగన్ మండలి రద్దుతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజభన హామీల అమలుతో పాటు అనేక అంశాలపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

అయితే నిన్న అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ ఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగి వచ్చేశారు. అయితే రేపు సాయంత్రం అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో జగన్ రేపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళబోతున్నాడు. అయితే ప్రధాని మోదీనీ కలిసిన అనంతరం అమిత్‌షాను జగన్ కలుస్తుండడంతో వీరిద్దరి మధ్య భేటీ ఆసక్తిగా మారింది. మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు వంటి అంశాలలో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది హోంశాఖనే కావడంతో దీనిపై అమిత్‌షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియాల్సి ఉంది.