రైతులకు ఉచిత విద్యుత్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Monday, October 12th, 2020, 11:33:26 PM IST

YS_Jagan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు వ్యవసాయ మోటార్లకి విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.అయితే దీని వలన రైతుల పై ఒక్క రూపాయి కూడా భారం పడనివ్వ బోము అని జగన్ స్పష్టం చేశారు. అయితే ఈ విషయం పై రైతులందరికీ కూడా అవగాహన కల్పించాలి అని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలను జారీ చేశారు.

ఉచిత విద్యుత్ అంశం పై నిర్వహించిన సమీక్షా సమావేశం లో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయం తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందించాలని సూచించారు. అయితే మీటర్ల ఏర్పాటు ద్వారా ప్రతి 15 నిమిషాలకు విద్యుత్ సరఫరా కి సంబంధించిన వివరాలు తెలుసుకొనే అవకాశం ఉంది అని తెలిపారు. విద్యుత్ బిల్లు మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రైతులకు ఏ మాత్రం భారం పడదు అని, ఎక్కడా అపోహలకు అవకాశం ఇవ్వకూడదు అని జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.