తెలంగాణ హక్కు బయ్యారం ఉక్కును మర్చిపోయారా.. కేటీఆర్‌కు భట్టి సూటి ప్రశ్న..!

Friday, March 12th, 2021, 03:02:11 AM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు చెబుతున్న మంత్రి కేటీఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమను మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్ని తప్పు పట్టడం లేదని కానీ తెలంగాణ హక్కు బయ్యారం ఉక్కు నినాదాన్ని మర్చిపోయారా అని నిలదీశారు.

అసలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై చేసిన ఒత్తిడి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఎగువన ప్రాజెక్ట్ లు నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని దీని వల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని, రెండు ప్రభుత్వాలను వదిలించుకోకపోతే ప్రజల జీవన స్థితిగతులు చిన్నాభిన్నమౌతాయని అన్నారు.