షర్మిల పార్టీతో కాంగ్రెస్‌కు ఏం నష్టం లేదు.. తేల్చి చెప్పిన సీఎల్పీ నేత భట్టి..!

Thursday, March 25th, 2021, 02:14:39 AM IST

తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోతున్న కొత్త రాజకీయ పార్టీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, వైసీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లినవారే షర్మిల పార్టీలోకి వెళ్తారని భట్టి చెప్పుకొచ్చారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉండబోదని ఇక్కడ జానారెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాగర్‌ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని, పీసీసీ నియామకంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న షర్మిల ఈ విషయంలో స్పీడ్ పెంచింది. ఖమ్మం జిల్లాపై ఎక్కువ ఫొకస్ పెట్టిన షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు వచ్చే నెల 9వ తేదిన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేసేందుకు సిద్దమయ్యింది. ఇందుకు పోలీసుల నుంచి అనుమతి కూడా లభించడంతో షర్మిల అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.